పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి/వైఎస్యూ వ్యవస్థలో విలీనం చేయొద్దని డిమాండ్ చేస్తూ తెలంగాణ పాలిటెక్నిక్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీపీజేఏసీ) ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరసన మంగళవారం 23వ రోజూ కొనసాగింది.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిజామాబాద్ స్థానిక విభాగం ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు.పాలిటెక్నిక్ విద్యావ్యవస్థ గత 70 ఏళ్లుగా పేద, నిరుపేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్యను అందిస్తూ విజయవంతంగా కొనసాగుతోందని టీపీజేఏసీ ప్రతినిధులు తెలిపారు.
దాదాపు 95 శాతం ప్రవేశాలతో పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఈ వ్యవస్థను మార్చడం వల్ల విద్యార్థులపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి/వైఎస్యూ వ్యవస్థలో విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ అంశంపై ఏర్పాటు చేసిన కమిటీని త్వరగా సమావేశపరిచి సానుకూల నివేదిక ఇవ్వాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి వ్యవస్థలో విలీనం చేయకూడదు. ఏర్పాటు చేసిన కమిటీని వెంటనే సమావేశపరిచి సానుకూల నివేదిక ఇవ్వాలి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను కొనసాగించాలి.
