తెలంగాణ విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్ విభాగంలో అకాడమిక్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న యేండల సువర్చల ప్రదీప్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. ఓయూ 85వ స్నాతకోత్సవాన్ని సోమవారం నిర్వహించారు.
కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ చేతుల మీదుగా సువర్చల ప్రదీప్ డాక్టరేట్ అందుకున్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
