నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్ గా చాల కాలం తర్వాత ఐపిఎస్ అధికారి నియామకం అయ్యారు. నార్త్ జోన్ డీసీపీ గా పనిచేస్తున్న రోహిణి ప్రియదర్శిని ని ఏడో బెటాలియన్ కమాండెంట్ గా నియామకం అయ్యారు.
ఆమె నిజామాబాద్ పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ సతీమణి ఆమె ఇటీవలే నార్త్ జోన్ డీసీపీ గా నియామకం అయ్యారు.
కానీ కల్మేశ్వర్ ను కమిషనర్ గా కొనసాగించాలని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పట్టుబట్టిన నేపథ్యంలో ఆయన్ని యదావిదిగా కొనసాగిస్తూ అతని సతీమణి ప్రియదర్శిని నే జిల్లాకు కమాండెంట్ గా బదిలీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల పక్రియ మొదలయ్యాక ఎన్నికల కమిషన్ స్వయంగా కల్మేశ్వర్ ను సీపీ గా నియమించింది.
అయన సక్సెస్ ఫుల్ గా ఎన్నికల పక్రియ పూర్తీ చేసారు. అదీగాక శాంతి భద్రతల నిర్వహణలో కఠినంగా వ్యవహరిస్తారనే ముద్ర వేసుకున్నారు.
