పశువధ శాల వద్ద వసూళ్ల కు పాల్పడుతున్న ఓ సీఐ వ్యవహారం రచ్చకెక్కింది. స్థానిక పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో సదురు సీఐ తోకముడిచారు. అనేక వివాదాల ముద్ర సీఐ తాజా వసూళ్ల దందా ఫై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ లో కీలక విభాగంలో సీఐ గా పనిచేస్తున్న ఓ అధికారి బక్రీద్ పండగ నేపథ్యంలో నగరంలో ఆయా ప్రాంతాల్లో పశువుల విక్రయాలు జరిగాయి. ప్రతి బక్రీద్ పండగ కోసం ఆయా ప్రాంతాల్లో రోడ్ల మీదే విక్రయాలు చేయడం ఆనవాయితీ గా వస్తుందే కేవలం ఆవుల అక్రమ రవాణా జరగకుండ మాత్రమే పొలీస్ శాఖ కట్టడి చేస్తుంది.
ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో చెక్ పోస్టు లు ఏర్పాటు చేసి పశువుల రవాణా అయ్యే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఈ మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం ఎప్పటిలాగే ఈసారి చర్యలు తీసుకుంది. ఇదే ముసుగులో ఓ సీఐ వసూళ్ల కు వేదికగా చేసుకున్నాడు. తన వద్ద ఉండే మరో ఇద్దరు కానిస్టేబుళ్ల వెంటేసుకొని కారు నగరంలోని శివారు ప్రాంతాల్లో పశువుల విక్రయాల కేంద్ర లకు వెళ్లి సంబంధీకుల నుంచి ముక్కుపిండి వసూళ్లకు తెగపడ్డారు.
మొదట బాబన్ సాబ్ పహాడ్, పెయింటర్ కాలొనీ ప్రాంతాల్లో హల్చల్ చేసారు. కొందరికి అనుమానం వచ్చి స్థానిక అయిదో టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సున్నితమైన వ్యవహారం కావడంతో వారు హుటాహుటిన వెళ్లి పశువుల అమ్మే వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న అధికారి ని చూసి కంగుతిన్నారు.సదురు అధికారి పోలీస్ శాఖ కు చెందిన వ్యక్తి అదికూడా సీఐ క్యాడర్ అధికారి కావడంతో నిస్సహాయులయ్యారు.
సీఐ నే సముదాయించి ఉన్నపలంగా వెళ్లిపోవాలని ప్రాధేయ పడ్డారు. చివరికి సదురు అధికారి సిబ్బంది తో కారు వెళ్లిపోయారు.సోమవారం పండగ కావడంతో ఆదివారం పోలీసు అధికారి వచ్చి హడావుడి చేయడంతో పశువులు అమ్మే వారు బెంబేలెత్తిపోయారు.