రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్యాకు పాల్పడిన విచారకమైన ఘటన నిజామాబాద్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. ఒకటవ టౌన్ పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం.నిజామాబాద్ నగరంలోనీ పోచమ్మ గల్లి కి చెందిన గైనీ నరేష్(39).మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఎలాంటి పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు.
ఈ క్రమంలో జీవితం పై విరక్తి కలగడంతో శనివారం రాత్రి సమయంలో నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో లాల్ ఘడ్ ఎక్స్ ప్రెస్ కింద పడి ఆత్మ హత్య చేసుకున్నట్లు పోలీస్ లు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోస్టు మార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటవ టౌన్ పోలీసులు వెల్లడించారు.