మద్యానికి బానిసై వ్యక్తి మృతి చెందిన ఘటన నందిపేట్ మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. నందిపేట్ ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం. మోపాళ్ మండల పరిధిలోనీ మంచిప్ప గ్రామానికి చెందిన బొర్రి లక్మన్ (38).
వృత్తి రిత్యా వ్యవసాయ కూలీ గా జీవన్ కొనసాగిస్తున్నాడు.మృతునికి భార్య ,ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. శనివారం అతని తమ్ముడు అయినా గంగాధర్ ను కొంత డబ్బు కావాలి అని ఫోన్ చేసి మాట్లాడాడు.దానికి తమ్ముడు సరే అని చెప్పడంతో మృతుడు శనివారం నందిపేట్ వెళ్ళాడు. ఈ క్రమంలో మృతుడు లక్మాన్, నందిపేట వెళ్లి మనస్థాపానికి గురై నండిపేట్ పరిధిలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కుటుంబం సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నందిపేట్ ఎస్ఐ రాహుల్
