నిజామాబాద్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన న్యాయవాది మల్లెపూలు జగన్మోహన్‌గౌడ్‌ను నిజామాబాద్ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ సభ్యులు ఘనంగా సన్మానించారు.
నగరంలోని కంఠేశ్వర్ ప్రైవేట్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ అధ్యక్షుడు పాదాల సత్తయ్య మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ ద్వారా జిల్లా వ్యాప్తంగా రక్తదాన సేవలు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ఆకాంక్షించారు.
ప్రజలకు సేవలందించే క్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీకి తమ క్లబ్ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి తాటిపాముల రాంప్రసాద్, కోశాధికారి అల్లాడి నాగరాజు, సభ్యులు రంజిత్‌సింగ్, కృష్ణారెడ్డి, విజయ్‌కుమార్, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
