Tuesday, April 21, 2026
HomeTelanganaHyderabadఉచిత బస్సు సౌకర్యం రద్దు చేసే ఎత్తుగడలో ఆర్టీసీ ….మహిళలతో సంతకాల సేకరణ

ఉచిత బస్సు సౌకర్యం రద్దు చేసే ఎత్తుగడలో ఆర్టీసీ ….మహిళలతో సంతకాల సేకరణ


ప్రగతిశీల మహిళా సంఘం. ఆధ్వర్యంలో మహిళాలకు ఉచిత బస్సు స్కీము నీరుగార్చడానికి ప్రభుత్వం చేసేకుట్రని వ్యతిరేకిస్తూ బస్సుల సంఖ్యలను పెంచాలని, సోమవారం కోట గల్లి లో సంతకాల సేకరణ చేశారు .


ఈ సందర్భంగా. జిల్లా అధ్యక్షురాలు. వి గోదావరి. జిల్లా నాయకురాలు. సునందలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు.గ్యారెంటీలను ప్రచారం చేసి అందులో ప్రధానంగా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్పి..

ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని .మా సంఘం హర్షిస్తుందని అన్నారు.. కానీ ఈ స్కీం ని రద్దు చేయడానికి అనేక కుట్రలు జరుగుతున్నాయని అందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాలకు నడుస్తున్న బస్సులను సంఖ్యను తగ్గించే ఆలోచనలో ఉన్నారని .. హైవేలో నడిచే ఎక్స్ప్రెస్ బస్సులను తగ్గించడం ప్రజల చేత వ్యతిరేకం వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారని ఈ కుట్రని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు..


ఒకవైపుపల్లెల ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. అధికారులు బస్సుల సంఖ్య తగ్గించే విషయాన్ని మీతో చర్చించలేదని ప్రశ్నించారు. బస్సుల సంఖ్య పెంచి ప్యాసింజర్లకు కలిగిస్తున్నారని, ఇబ్బందులు తొలగించాలని అన్నారు.


గ్రామీణ ప్రాంతాల్లో.. ముఖ్యంగా స్కూల్ విద్యార్థుల కోసం బస్సుల సంఖ్యను పెంచాలి.. రద్దు చేసిన బస్సులతో పాటు అదనంగా బస్సులను పెంచాలన్నారు. అంతేకాకుండా ఎక్స్ప్రెస్ బస్సులను నూతనంగా పెంచి నడపాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.


బస్సుల సంఖ్యను పెంచి ప్యాసింజర్ల ఇబ్బందులు తొలగించాలని సంతకాల సేకరణ చేస్తున్నామని అన్నారు
ఈ కార్యక్రమంలో.. ప్రగతిశీల మహిళా సంఘం.. నాయకులు. గీత. రాజమణి. అనిత. తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!