HomeTelanganaNizamabadనందిపేట నియో నీటిల్ ఫ్లవర్ పాఠశాలలో సైన్స్ ఫేర్ ప్రదర్శన...

నందిపేట నియో నీటిల్ ఫ్లవర్ పాఠశాలలో సైన్స్ ఫేర్ ప్రదర్శన…

త్వరలో రాబోతున్న నేషనల్ సైన్స్ డే ని పురస్కరించుకొని నందిపేట్ మండల కేంద్ర నియో లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో సోమవారం కలాం ఇనిస్ట్యూట్ ఆఫ్ యూత్ ఎక్స్లెంట్ వారి సహకారంతో డి ఆర్ డి ఓ, ఇస్రో లలో తయారైన మీసైల్స్, సాటిలైట్స్..

మాంగల్యాన్, ఆర్యభట్ట, బ్రహ్మోస్, చంద్రయాన్, అస్త్ర ఇలా దాదాపు 20 మోడల్స్ లను ప్రదర్శించారు. నందిపేట డొంకేశ్వర్ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ప్రదర్శనలో ఉంచిన రాకెట్, మిస్సైల్స్, సాటిలైట్స్, మూన్ నమూనాలను తిలకించారు. ఇట్టి కార్యక్రమన్ని మండల విద్య శాఖ అధికారి అవదుత.గంగాధర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంఈఓ అవధూత గంగాధర్ మాట్లాడుతూ…..మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక భారతీయుడు సైంటిస్ట్ కావాలని ఉద్దేశంతో విద్యార్థి దశ నుంచి ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాలని.

డి ఆర్ డి ఓ, ఇస్రోలా పనితనాన్ని విద్యార్థులకు వివరించారు, అలాగే ఎక్కడో ఉన్న శ్రీహరి కోట, విక్రంసారబాయి లాంటి సెంటర్ లను వెళ్లి సందర్శించాలి అంటే వ్యాప్రాయాషాలతో కూడిన పని అని అలాంటిది ఇక్కడ మారుమూల ప్రాంత విద్యార్థులకు వాటిని చూసి వాటి గురించి తెలుసుకునేలా చేసిన పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ ఇక ముందు ఇలాంటి ఎవయినా విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలలో పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.

విద్యార్థుల యొక్క మేధాశక్తిని ఆలోచనలను పెంచాలని రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారుడు డాక్టర్ సతీష్ రెడ్డి స్ఫూర్తితో తెలంగాణలో వందరోజుల కార్యక్రమం లో భాగంగా నియో లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారాని ఇట్టి అవకాశాన్ని వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్, కాలేజిలా విద్యార్థిని, విద్యార్థులు మరియు యువతీ యువకులు దాదాపు 1600 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు అని పాఠశాల కరస్పాండంట్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ట్రస్మ రాష్ట్ర సెక్రెటరీ రమేష్,నియో లిటిల్ ప్లవర్ కరస్పాండెంట్ గోజురి అరుణ్ కుమార్,నిజామాబాద్ రవి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ సరళ మహేందర్ రెడ్డి,సాగర్,చిరంజీవి,తల్లితండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments