సమయానికి పాఠశాలకు హాజరు కాని నలుగురు ఉపాధ్యాయులకు డీఈవో అశోక్ షోకాజ్ నోటీసులను అందజేశారు.
గురువారం నగరంలోని వినాయక నగర్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పద్మావతి, భారతి, విజయశాంతి, కరుణ నలుగురు టీచర్లు సమయానికి పాఠశాలకు రాకపోవడంతో తఖీదు జారీ చేశారు.
అలాగే ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాల సమయానికి హాజరు కావాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
