HomeCRIMEఒకేసారి ఆరుగురు ఎస్ఐ లు పదవీవిరమణ...

ఒకేసారి ఆరుగురు ఎస్ఐ లు పదవీవిరమణ…

నిజామాబాద్ జిల్లాలో ఒకేసారి ఆరుగురు ఎస్ఐ లు, ఒక హోం గార్డు ల పదవి విరమణ జరిగింది.శనివారం పదవి విరమణ కార్యక్రమం జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు.

వారిలో స్పెషల్ బ్రాంచ్ ఎస్.ఐ గా విధులు నిర్వహిస్తున్న జి.శ్రీనివాస్ రావ్,మూడవ టౌన్ రెండవ ఎస్ఐ గా పని చేస్తున్న కె. నర్సయ్య,నిజామాబాద్ రూరల్ రెండవ ఎస్ఐ రామారావు,అలాగే మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ పనిచేస్తున్న మహ్మద్ ఆరీఫ్ ఉద్దీన్,ఎ.ఆర్.ఎస్.ఐ అబ్దుల్ సలీం,అలాగే ఎ.ఆర్.ఎస్.ఐ మహ్మద్ సలీమ్ ఉద్దీన్,హోమ్ గార్డు గా విధులు నిర్వహిస్తున్న నెంబర్ 199 జి. నాగరాజు లు పదవి విరమణ చేశారు. వీరికి అదనపు పోలీస్ కమిషనర్(అడ్మిన్) బస్వారెడ్డి శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి, ఎలాంటిరిమార్కు లేకుండాపదవి విరమణ చేయడం ఎంతో గోప్ప విషయమని, ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని

మీరు డిపార్టుమెంటల్ కు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయపడుతామని, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తుభాగుండాలని ఆకాంక్షించారు.ఈ వీడ్కోళ్లు సందర్బంగా స్పెషల్ బ్రాంచ్ ఎ.సి.పి ఎస్. శ్రీనివాస్ రావ్, పోలీస్ కార్యాలయం ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, బషీర్., స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, రిజర్వు ఇన్స్ పెక్టర్స్ శ్రీనివాస్,తిరుపతి,శేఖర్ మరియు వారికుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments