నిజామాబాద్ నగరంలోని పలు పతంగుల షాపుల్లో సీసీయస్ శనివారం తనిఖీలు చేపట్టింది. ఇన్‌చార్జి సిపి ఆదేశాల మేరకు ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ సీఐ అంజయ్య, సిబ్బంది అజమ్ రోడ్‌లో పతంగుల దుకాణాల్లో తనిఖీ చేశారు.
20బెండల్స్ చైనా మాంజను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు అమౌంట్ రూ.10వేలు ఉంటుందని తదుపరి చర్య నిమిత్తంరెండో టౌన్ పోలీసులకు అప్పగించారు.
