మంత్రాల చేస్తున్నాడని అనుమానంతో తండ్రి మీద దాడికి తెగబడ్డాడు కొడుకు. ఈ ఘటన ధర్పల్లి మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. దాడికి పాల్పడిన కొడుకు భీమగల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడి కుటుంబీకులు సోమవారం నిజాంబాద్ పోలీస్ కమిషనర్ ను కమిషనర్ కు లిఖితపూర్వకంగా కోరారు. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాజేందర్ తనతండ్రి బుచ్చన్న తరుచు మంత్రాలు చేస్తున్న డనే అనుమానంతో
ఈనెల 22న మరో ఎనిమిది మంది కలిసి పథకం ప్రకారం ఇంటికి వచ్చి కొట్టారని బాధితుడు అక్క రాజవ్వ లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే రోజు తాము ధర్పల్లి పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశామని కేసు నమోదు అయిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు వాపోయారు.
అయితే ఈ దాడిలో గాయపడ్డ బుచ్చయ్య నిజామాబాద్ నగరంలోని మెడికవర్ ఆసుపత్రి లో చికిత్స పొంతున్నారని రాజవ్వ పేర్కొంది