పదేళ్ల తరవాత అధికారం దక్కడం తో కాంగ్రెస్ పార్టీ ఈసారి లోకసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలకే నియోజకవర్గ ఇంచార్జ్ లుగా నియమించింది. పాలన, పార్టీలో వ్యవహారలో వారుచెప్పిందే ఫైనల్ సాగుతుంది.కానీ ఇద్దరు దిగ్గజ నేతలున్న అర్బన్ నియోకవర్గంలో ఎవరికి వారే యమునా తీరాన్నట్లుగా ఉంది. అసలు అర్బన్ లో ఎవరు పెత్తనం సాగుతుందో తెలియక క్యాడర్ అయోమయంలో ఉంది. పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ల మధ్య ఆధిపత్య పోరుకు అర్బన్ వేదికగా మారింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులను అదే నియోజకవర్గాలకే ఇంచార్జ్ లుగా కొనసాగిస్తుంది. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ పోటీ చేసి ఓడిపోయారు. కానీ పార్టీ అధికారంలోకి రావడంతో షబ్బీర్ అలీ ని సీఎం రేవంత్ రెడ్డి చేరదీశారు. సలహాదారు గా పదవీ కట్టబెట్టారు.
దీనితో అర్బన్ లో ఆయనే గిర గిరా చక్రం తిప్పుతారని ఆయన కొటారి భావించింది. కానీ అర్బన్ టికెట్ త్యాగం చేసిన పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ గౌడ్ అనూహ్యంగా ఎమ్మెల్సీ గా నియామకం అయ్యారు. మహేష్ పార్టీ హోదాకే పరిమితం అవుతారని తామే అన్నీ వ్యవహారాలు నడపొచ్చని పార్టీలో షబ్బీర్ అలీ వర్గం అనుకున్నారు.
ఎలాగో షబ్బీర్ అలీ కామారెడ్డి మీద ఎక్కువగా దృష్టిపెడుతారని కాబట్టి అర్బన్ లో తాముది ఆడిందే అట పాడిందే పాట సాగించవచ్చనుకున్నారు. కానీ అనూహ్యంగా మహేష్ ఎమ్మెల్సీ గా అధికార హోదా లోకి రావడం ఆయన ప్రొటొకాల్ అర్బన్ లోనే నమోదు చేయించుకున్నారు. దీనితో షబ్బీర్ అలీ వర్గం దూకుడు కు కళ్లెం పడింది. అర్బన్ కాంగ్రెస్ లో ఓ కీలక యువనేత డిఎస్పీ ఆర్డీవో లాంటి పోస్టింగ్ లకోసం షబ్బీర్ వద్ద మంత్రాంగం కూడా నడిపారు. కానీ మహేష్ ఎంట్రీ తో ఆ పైరవీలు తుస్సుమన్నాయి.పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉన్నాసరే అర్బన్ పార్టీవ్యవహారాల్లో మాత్రం క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.
ఓ దశలో షబ్బీర్ అలీ కామారెడ్డి సెగ్మెంట్ కు వెళ్తారని మహేష్ అర్బన్ బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం జరిగింది. మహేష్ కూడా సన్నహితులకు ఇదే విషయం చెప్తూ వస్తున్నారు. కానీ షబ్బీర్ మాత్రం ససేమిరా అర్బన్ ను వదిలేది లేదని అర్బన్ నేతలకు చెప్తున్నారని సమాచారం. కామారెడ్డి లో సీఎం పక్షాన పనిచేస్తున్నాని కానీ అధికారికంగా తన సెగ్మెంట్ నిజామాబాద్ అర్బన్ నే అని షబ్బీర్ తెగేసి చెప్తున్నారు.
కానీ గత రెండు దశాబ్దాలుగా డీఎస్ ను తట్టుకొని అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి అర్బన్ పార్టీలో తనదైన ముద్ర వేసుకుంటూ వస్తున్నారు. కానీ అందివచ్చిన ఎమ్మెల్సీ అందలంతో రాబోయే రోజుల్లో అర్బన్ లో తిరుగులేని ఆధిపత్యం సాగించే దిశగా మహేష్ గౌడ్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.
