నిజామాబాద్ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కార్యక్రమంలో పాల్గొన్న వయోవృద్ధులను ఎమ్మెల్యే వ్యక్తిగతంగా కలుసుకుని వారి ఆరోగ్య, సంక్షేమ సమస్యలను ఆరా తీశారు. అనంతరం సభలో మాట్లాడిన ఆయన“వయోవృద్ధులు మన సంస్కృతి, కుటుంబ వ్యవస్థకు మూలస్తంభాలు. వారి అనుభవం, జ్ఞానం యువతకు దారి చూపే వెలుగు. పెద్దలను గౌరవించడం మానవత్వానికి ప్రతీక” అని పేర్కొన్నారు.ఇటీవలి కుటుంబ నిర్మాణ మార్పులతో అనేక మంది పెద్దలు ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ప్రభుత్వం వయోజనుల కోసం అమలు చేస్తున్న ఎల్డర్ లైన్ 14567, ఆరోగ్య శిబిరాలు, సీనియర్ సిటిజన్స్ హోమ్స్, డే కేర్ సెంటర్స్ వంటి పథకాలను ఆయన వివరించారు.“పెద్దలకు ప్రభుత్వ సేవలతో పాటు కుటుంబ ప్రేమ అత్యంత ముఖ్యమైనది. వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం, సమాజం, కుటుంబం కలిసి పనిచేయాలి” అని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీ అంకిత్ , ట్రైనీ కలెక్టర్ శ్రీమతి కెరోలిన్ , డీసీపీ బస్వా రెడ్డి , తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధి రామ్ మోహన్ , ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నుండి అంజయ్య , సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నుండి రాజేశ్వర్ , జిల్లా రక్షణ–శిశు సంక్షేమ విభాగం నుండి డా. రవి తేజ గారు, మహిళా & శిశు సంక్షేమ శాఖ PD శ్రీమతి రసోలి , స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి దరం గంగాధర్ , తదితరులు పాల్గొన్నారు. వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షలు, కౌన్సెలింగ్, పథకాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.చివరిగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త “నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని ప్రతి వయోవృద్ధుడికి ప్రభుత్వ సంక్షేమ సేవలు చేరేలా కట్టుబడి ఉన్నాను” అని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments