HomeCRIMEరోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాలని కలలు కన్న ఓ యువకుడి ఆశలు రోడ్డు ప్రమాదంతో ఆవిరయ్యాయి. మృత్యువు రోడ్డు రూపంలో వచ్చి అతడిని కబళించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

వివరాల్లోకి వెళ్తే.. నీరడి అఖిలేశ్ (23) అనే యువకుడు సోమవారం రాత్రి పనుల నిమిత్తం ముల్లంగి, దూసుగావ్ వైపు వెళ్లి తిరిగి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో కులాస్పూర్తితండాలోని కల్వర్టు వద్దకు చేరుకోగానే.. అదుపుతప్పిన బైక్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అఖిలేశ్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అఖిలేశ్, కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకోవాలని ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతలోనే జరిగిన ఈ దుర్ఘటన ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. అఖిలేశ్ మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments