HomeCRIMEఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్‌గా శ్రీధర్

ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్‌గా శ్రీధర్

నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారుల బదిలీలు చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుదీర్ఘకాలంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు స్థానచలనం పొందగా, నూతన అధికారులు బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్‌కు పదోన్నతి కల్పిస్తూ, ఆయనను నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌గా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.

గతంలో ఇక్కడ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన సోమిరెడ్డిని ఖమ్మం జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా, నిజామాబాద్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్‌గా టి. అరుణ్ కుమార్ నియమితులయ్యారు.

త్వరలోనే నూతన అధికారులు బాధ్యతలు చేపట్టనున్నట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments