రాష్ట్ర వ్యాప్తంగా 2025 -27 ఏడాదికి మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఎక్సైజ్ శాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మద్యం షాపు కోసం కనీస దరఖాస్తు రుసుము రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు.
ఎప్పటిలాగే రెండేళ్ల కాలపరిమితి పెట్టారు.మూడు లక్షల ఫీజు తో దరకాస్తు చేసిన వారికి లాటరీ a లాటరీ ద్వారా షాపులను కేటాయించనున్నారు. ఈసారి మద్యం షాపు కేటాయింపుల్లో రిజర్వేషన్ పాటించనున్నారు.
ఇందులో గౌడ సామాజికవర్గానికి 15 శాతం, ఎస్సీ సామాజికవర్గానికి 10 శాతం, ఎస్టీ సామాజికవర్గానికి 5 శాతం షాపులను కేటాయించనున్నారు. భాగస్వామ్య సంస్థలు, కంపెనీలు దరఖాస్తు చేయడానికి అనుమతించారు. అదేవిధంగా ఒకే దరఖాస్తుదారుడు ఒక లిక్కర్ షాపునకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు దాఖలు చేయవచ్చు.
మొత్తం 6 శ్లాబ్‌లలో ఎక్సైజ్ శాఖ లైసెన్స్‌లను జారీ చేయనుంది. 2011 జనాభా లెక్క ప్రకారం 5 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి ఎక్సైజ్ ట్యాక్స్ రూ.50 లక్షలు, 5 వేల నుంచి 50 వేలు జనాభా ఉన్న పాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి 1 లక్ష జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.60 లక్షలు, 1 లక్ష నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలు, ఇక 20 లక్షలపైన జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి ఎక్సైజ్ ఫీజు రూ.కోటి పది లక్షలుగా నిర్ణయించారు. మరో రెండు మాసాలలో ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్ గడువు పూర్తీ అవుతుంది.
