సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటన నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది.
నగరంలోని వర్ని చౌరస్తా వద్ద సైకిల్ పై వెళ్తున్న నాగన్న అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో గాయాలయ్యాయి.
దీంతో సదరు క్షతగాత్రున్ని హుటాహుదిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
స్థానిక సమాచారం మేరకు ఐదవ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆర్టీసీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై గంగాధర్ పేర్కొన్నారు.
