HomeCRIMEగంజాయి బ్యాచ్‌ …..మందు బాబుల నుంచి వసూళ్ల దందా….అయిదో టౌన్‌ కానిస్టేబుల్‌ నిర్వాహకం

గంజాయి బ్యాచ్‌ …..మందు బాబుల నుంచి వసూళ్ల దందా….అయిదో టౌన్‌ కానిస్టేబుల్‌ నిర్వాహకం

నగరంలో పోలీసింగ్‌ ప్రక్షాళన దిశగా కసరత్తులు జరుగుతుంటే కిందిస్థాయిలో కొందరు కానిస్టేబుళ్ల తీరు ఈ కార్యాచణకే విఘాతం కలిగించేలా ఉంది. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే కానిస్టేబుళ్ల సంగతి ఎలా ఉన్నా జిల్లా కేంద్రంలో ఐదో టౌన్‌ పోలీసుస్టేషన్‌లో పనిచేసే ఓ కానిస్టేబుల్‌ స్థానికంగా ఉండే గంజాయి మద్యం తాగే వారిని సైతం వదలడం లేదు.

రోడ్డు పక్కన మద్యం తాగే వారిని ట్యాబ్‌లో ఫొటోలు తీస్తూ కేసులు నవెూదు చేస్తానంటూ బెదిరిస్తూ అయినకాడికి దండుకుంటున్నారు. నగరంలోని వర్ని చౌరస్తాలో దసరా పండగకు మూడు రోజుల ముందు ఇద్దరు యువకులు ఆటో రిక్షాలో రోడ్డు పక్కనే మద్యం తాగుతున్నాడు.

అధిగమనించిన కానిస్టేబుల్‌ మందు బాబు ఫొటో తీసుకొని అతని సెల్‌ ఫోన్‌ లాక్కొని పంపించేస్తాడు. పండగ తర్వాత రెండో రోజు సదురు కానిస్టేబుల్‌ మద్యం తాగిన యువకులను ఫోన్‌ చేసి పిలిచి సెల్‌ ఫోన్‌ ఇవ్వాలంటే నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని లేదంటే కేసు వేసి కోర్టు కు పంపిస్తానని ధమ్కీ ఇస్తాడు. వావ్మెూ నాలుగు వేల ఎలా ఇస్తాం కావాలంటే వెయ్యి ఇస్తామని బేరం అడుగుతారు.

లేదంటే కోర్టు కే పంపాలని కోరుతారు. చివరికి మూడు వేల కు బేరం సెట్‌ కావడంతో నాగారం పెట్రలో బ్యాంకు వద్ద మూడువేలు తీసుకోని సెల్‌ ఫోన్‌ ఇచ్చేసాడు. అంతకు ముందే వారం రోజుల క్రితం నలుగురు యువకులు గంజాయి తాగుతూంటే సదురు కానిస్టేబుల్‌ రెడ్‌ హ్యాండ్‌ గా పట్టుకొని అందులో గంజాయి తాగని యువకుడి తో మూడు వేల రూపాయలుతీసుకోని వదిలేసాడు.

అలాగే చెట్టు తొలగించే విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగితే చెట్టు కట్‌ చేయడానికి తెచ్చిన కటింగ్‌ మిషన్‌ ను స్వాధీనంచేసుకుంటే చివరికి ఎస్సై సీరియస్‌ అయితే గాని ఆ మిషన్‌ ఇవ్వలేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments