HomeTelanganaHyderabadకోదండరామ్ ని కలిసిన కారేగాం సర్పంచ్

కోదండరామ్ ని కలిసిన కారేగాం సర్పంచ్

తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండారం ను తన నివాసం లో కారే గాం గ్రామానికి ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ డాక్టర్ రామావత్ లాల్ సింగ్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలు, స్థానిక పరిపాలనలో ఎదురవుతున్న సవాళ్లపై సుదీర్ఘంగా చర్చించారు.

గ్రామాల సర్వతో ముఖాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, మేధావుల సహకారం ఎంతో అవసరమని సర్పంచ్ డాక్టర్ రామావత్ లాల్ సింగ్ కోరారు.

ప్రొఫెసర్ కోదండారం గ్రామీణ అభివృద్ధికి తగిన సూచనలు అందించారు. ఈ సమావేశంలో టివియువి జిల్లా అధ్యక్షులు అజయ్, సుభాష్ సంతోష్, వెంకటేష్, సాజు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments