.
నగరంలోని 45వ డివిజన్ ప్రగతినగర్ పరిసర ప్రాంతాల్లో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధనపాల్ సూర్యనారాయణ బుధవారం శ్రీకారం చుట్టారు.
టీయూఎఫ్ఐడిసి నిధులతో మంజూరైన ఈ పనులను ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. డివిజన్ పరిధిలోని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ :ll ప్రగతినగర్‌లోని అన్ని ప్రధాన అంతర్గత బీటీ రోడ్లు, ఆర్ఎస్ఎస్ కార్యాలయ రోడ్డు, శ్రీనగర్ కాలనీలోని షటిల్ కోర్టు నుండి ఓపెన్ జిమ్ వరకు నూతనంగా బీటీ రోడ్ల నిర్మాణం, ఎల్లమ్మగుట్టలోని అడ్వకేట్ రాంచందర్ నివాసం, నాలం లింగం, దొంతుల భూమయ్య (1, 2, 3 రోడ్లు), ముల్కరవి హౌస్ నుండి సదానంద్ నివాసం వరకు, అలాగే పీఎన్టీ కాలనీ, దొంతుల సురేష్ నివాస ప్రాంతాల్లో మురుగు కాలువల నిర్మాణం. వినాయక నగర్ వెస్ట్ సైడ్ నుండి ఆర్టీఏ రాజన్న ఇల్లు, దుబ్బ లక్ష్మి నివాసం నుండి ముత్యాల లింగన్న ఇల్లు వరకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీల్లో డ్రైనేజీ సమస్యలు లేకుండా చూడటం, అధ్వాన్నంగా ఉన్న రోడ్లను పునర్నిర్మించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
నాణ్యతతో, నిర్ణీత సమయంలోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రగతినగర్ కాలనీ వాసులు ధర్మపురి సురేంధర్, అంకం లక్ష్మణ్, టక్కర్ హన్మంత్ రెడ్డి, కట్కం శ్రీనివాస్, ధన్పాల్ చందు, జేబీ అపార్ట్మెంట్ నివాసితులు, బీజేపీ నాయకులు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
