Monday, April 20, 2026
HomeTelanganaNizamabadహిందూ సమాజాన్ని జాగృతం చేయడంలో ప్రతిష్టిత వ్యక్తుల పాత్ర కీలకమైంది - ఆర్ఎస్ఎస్

హిందూ సమాజాన్ని జాగృతం చేయడంలో ప్రతిష్టిత వ్యక్తుల పాత్ర కీలకమైంది – ఆర్ఎస్ఎస్

అఖిల భారతీయ ధర్మజాగరణ సహస సంయోజక్ ఏలే శ్యామ్ కుమార్*హిందూ సమాజాన్ని జాగృతం చేయడంలో సమాజంలోని ప్రతిష్ఠిత వ్యక్తుల పాత్ర అత్యంత కీలకమైందని అందుకే దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని ప్రముఖ నగరాలలోని హిందూ సమాజానికి చెందిన ప్రతిష్ఠిత వ్యక్తుల సమ్మేళనాలను ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్నదని ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ధర్మజాగరణ సహ సంయోజక్ ఏలే శ్యాంకుమార్ వ్యాఖ్యానించారు.భారతదేశ యొక్క ఎదుగుదలను ఓర్వలేని విదేశాల యొక్క కుట్రలలో భాగంగా కొన్ని సంస్థలు మరియు దేశ విచ్చిన్నకర శక్తులు అందరూ ఏకమై హిందూ సమాజాన్ని విచ్చినం చేయడానికి ఎన్నో రకాల కుట్రలకు పాల్పడుతున్నారని వాటన్నింటినీ సమిష్టిగా హిందూ సమాజం ఎదుర్కోవడానికి కావలసిన ఐకమత్యాన్ని నిర్మాణం చేయడం కోసమే ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నదని వారు పేర్కొన్నారు.

భాష పేరుతో, ప్రాంతం పేరుతో హిందూ సమాజాన్ని విచ్చిన్నం చేయడానికి కులాల మధ్యన ప్రాంతాల మధ్యన భాష పేరుతో సరిహద్దుల పేరుతో కుట్రలు చేస్తున్నారని ఆ మాయలో పడి హిందువులు తమ యొక్క స్వధర్మాన్ని మరిచిపోయి విదేశీ కుట్రలకు బలవుతున్నారని ఈ స్థితి నుంచి హిందూ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని వారు గుర్తు చేశారు.

సమాజంలోని అన్ని రంగాలలో ఉన్న ప్రముఖులుగా మీరందరూ తమ తమ రంగాలలోని ప్రజలకు వాస్తవాలను వివరించి దేశభక్తి యొక్క ఆవశ్యకతను హిందూ సమాజ సంఘటన యొక్క ఆవశ్యకతను వివరించడం నేటి తక్షణ అవసరమని వారు తెలిపారు.

ఆర్ఎస్ఎస్ తన అస్తిత్వం కోసం ఏనాడూ పని చేయలేదని కేవలం హిందూ సమాజం కోసం భారతదేశ కోసం మాత్రమే తన 100 సంవత్సరాల ప్రయాణాన్ని కొనసాగించిందని రానున్న కాలం మొత్తం కూడా దేశం కోసమే పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఇందూరు విభాగ్ సహ సంఘచాలక్ పాలేటి వెంకట్రావు, జిల్లా సంఘచాలక్ డాక్టర్ కాపర్తి గురుచరణం, విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్, నగర కార్యవాహ అరుగుల సత్యం, జిల్లా,నగరంలోని ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!