HomeTelanganaNizamabadఎనిమిది గ్రామాల సర్పంచ్ లు ఏకగ్రీవమే నా ....? ఓకే నామినేషన్ .....చక్రం తిప్పిన పోచారం...

ఎనిమిది గ్రామాల సర్పంచ్ లు ఏకగ్రీవమే నా ….? ఓకే నామినేషన్ …..చక్రం తిప్పిన పోచారం !

స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగా హోరాహోరీ పోరు వుంటుంది.ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు అసాధారణం గ్రామ అభివృద్ధి కమిటీలు బలంగా ప్రాంతాల్లోనే ఇలాంటి వి జరుగుతాయి కానీ గ్రామాభివృద్ధి కమిటీల ఉనికి నామమాత్రంగా ఉండే బోధన్ డివిజన్ లో గ్రామ పంచాయితీ ల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావడం చర్చనీయాంశమ అయింది.

బోధన్ డివిజన్ లో మొదటి దఫా లో ఎన్నికలు జరుగుతున్నాయి. బాన్స్ వాడ నియోజకవర్గం పరిధి లో ఆరు మండలాలున్నాయి.

సర్పంచ్ స్థానాలను గంప గుత్తగా గెలవడానికి ఎమ్మెల్యే పోచారం వ్యూహరచన చేస్తున్నారు వర్ని మండలంలో ఏకంగా ఎనిమిది (8) కోటగిరి లో రెండు గ్రామ పంచాయతీలు సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకున్నాయి.రూప్లానాయక్ తండా : బలరాం, మల్లారం : లక్ష్మణ్ ముదిరాజ్ , వకీల్ ఫారం : మద్దిపూడి శ్రీనివాస్, శంకోరా : హరిసింగ్, రాజ్ పేట : కవిత, సిద్దాపూర్ : బాల్ సింగ్, చింతలపేట తండా : నెహ్రు, చెల్క తాండా : గొట్టిపాటి శ్రీనివాస్ రావు లను ఎన్నుకున్నారు. రాజకీయాలకు అతీతంగా, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు ఏకతాటిపైకి వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నారు.

‘పోటీల వల్ల సమయం, డబ్బు వృథా అవుతుంది, ఆ మొత్తాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించుకోవచ్చు’ అనే సామాజిక స్పృహతో వారు ఈ నిర్ణయాన్ని అమలు చేశారు.

“ఎన్నికల కోసం ఖర్చు చేసే లక్షలాది రూపాయలు గ్రామంలో రోడ్లకో, తాగునీటికో ఉపయోగిస్తే బాగుంటుందనీ, అందుకే కలిసి ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకున్నాం” అని గ్రామస్థులు తెలిపారు.

అలాగే కోటగిరి మండలంలో కూడా రెండు (2) గ్రామాలలో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.కోటగిరి మండలంలో రాంపూర్ : శాంకి బాయి, అడకాస్ పల్లి : రెడ్డి రామకృష్ణ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేవలం అభివృద్ధిపైనే దృష్టి సారించి, అనవసర వివాదాలకు తావు లేకుండా

ఈ గ్రామాలు ఏకగ్రీవ తీర్పును ప్రకటించాయి. మొత్తంగా, 10 గ్రామాలలో (వర్ని 8, కోటగిరి 2) ప్రజలు ప్రదర్శించిన ఈ పరిణతితో కూడిన తీర్పు.. భవిష్యత్తులో స్థానిక ఎన్నికలకు ఒక సరికొత్త మార్గాన్ని చూపింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments