కేంద్ర కార్యాలయంలోనే హడావిడి..క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పట్టని వైనం.వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌పుట్టినా.. గిట్టినా అక్కడ డబ్బే ధ్రువీకరిస్తుంది. ‘నోటు మాటకు పనిచెబితే ధ్రువీకరణ పత్రాలు ఇట్టే చేతికొచ్చేస్తాయి.
లేదంటే నిబంధనల పేరుతో కొర్రీలు వేస్తూ కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటారు. వివిధ అవసరాల నిమిత్తం మరణ ధ్రువీకరణ పత్రాల కోసం మున్సిపల్ కార్పొరేషన్ లోని జనన మరణ ధృవీకరణ కార్యాలయం గడప తొక్కుతున్న బాధితుల నుంచి అధికారులు భారీ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వెలువెతుతున్నాయి.ఈ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతి పనికీ ఓ ధర నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారని, చేయి తడిపితే తప్ప ఫైలు ముందుకు కదలడం లేదని, లేదంటే కొర్రీలు తప్పడం లేదన్న చర్చ నడుస్తోంది.నగరపాలక పరిధిలో ప్రతి నెలా 2000 -2500 మందికి జనన, 500-1000 వరకు మరణ ధ్రువీకరణ పత్రాలు అధికారులు జారీ చేస్తున్నారు.
కానీ గత నెల రోజుల క్రితం నూతన అధికారి వచ్చిన నాటి నుంచి సుమారు 2400 ఫైలు పెండింగ్ లో ఉన్నాయి. మీకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలంటే ఎంతో కొంత ముట్టచెప్పాలనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.జనన, మరణ ధ్రువీకరణ పత్రం ఏదైనా నెలరోజుల వ్యవధిలో దరఖాస్తు చేసుకొంటే ఓ రేటు…
అదే ఏడాదో? రెండేళ్ల కిందట చనిపోయిన వారి పేరుతో మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలంటే మరో రేటుతో బహిరంగంగానే మాట్లాడుతున్నారనే ఆరోపణలు వెలుగుతున్నాయి. నెలల కొద్ది కార్యాలయం చుట్టూ తిరిగిన కొర్రల పేరుతో కళ్ళ చెప్పులు అరిగేలా తిప్పుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డబ్బులు ఇస్తేనే మీ పని సాఫీగా జరుగుతుందని, లేదంటే మీ పని కాదని బహిరంగంగానే చెబుతున్నారు. పనిని బట్టి రేటును నిర్ణయించి వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
