Saturday, May 2, 2026
HomeTelanganaNizamabadబీసీ రిజర్వేషన్ ఇచ్చాకే లోకల్ ఎన్నికలు .....సుప్రీం కోర్టు కు వెళ్తాము .....స్పష్టం చేసిన పీసీసీ...

బీసీ రిజర్వేషన్ ఇచ్చాకే లోకల్ ఎన్నికలు …..సుప్రీం కోర్టు కు వెళ్తాము …..స్పష్టం చేసిన పీసీసీ చీఫ్ మహేష్

బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కట్టుబడి అమలు చేస్తామని పేర్కొన్నారు. హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసే యోచనలో ఉన్నామన్నారు.

అందుకు సుప్రీం కోర్టు తలుపులు తడుతామని చెప్పారు.బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడంలో ప్రధాన ముద్దాయి బీజేపీ పార్టీనే అని ఆరోపించారు. కుల సర్వే చారిత్రాత్మక నిర్ణయం — పారదర్శకంగా నిర్వహించాం అదే ఆధారంతో సుప్రీం కోర్టు కు వెళ్తామన్నారు.

బీజేపీ – బిఆర్ఎస్ కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేస్తున్నారనీ అన్నారు.42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళతామని పేర్కొన్నారు.ఇప్పటివరకు మూడు చట్టాలు, ఒక ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

బీసీల నోటి కాడ ముద్దను లాగే ప్రయత్నం బీజేపీ, బిఆర్ఎస్ చేస్తున్నాయనీ తెలిపారు. ఢిల్లీ బీసీ రిజర్వేషన్ ధర్నాకు బీజేపీ నేతలు ఎందుకు మొఖం చాటేశారనీ ప్రశ్నించారు. మాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టే బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత బీజేపీ బిఆర్ ఎస్ నేతలకు లేదనీ తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బనక చర్ల జీవోలు వెలువడ్డాయనీ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

బనక చర్ల విషయంలో హరీష్ రావు మైల కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారనీ విమర్శించారు. శనివారం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

రాయలసీమను రత్నాల సీమను చేస్తానన్నది కేసీఆర్ కాదా? జీవోలపై ఆంధ్రా హక్కులను కాపాడతానన్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.జగన్‌తో కేసీఆర్ చెట్టాపట్టాలు వేసుకుని విందులు, వినోదాలు చేసుకున్నారు.

ప్రజల హక్కుల విషయంలో మాత్రం మౌనం వహించారనీ మండిపడ్డారు.బనక చర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదనీ స్పష్టం చేశారు.బనక చర్ల పై మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లతో వివరించే ప్రయత్నం చేశారనీ తెలిపారు.

బీసీ రిజర్వేషన్లు, బీజేపీ – బిఆర్ఎస్ ద్వంద్వ వైఖరిపై చేస్తుందని అన్నారు.జిల్లాకి రావాల్సిన అభివృద్ది విషయంలో చిత్త శుద్ధితో ఉన్నామని తెలిపారు. జిల్లా లోని ఆర్వోబి పనుల విషయంలో కేంద్రం ఇచ్చిన నిధులే పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.

కేంద్ర నిధులు మంజూరు అయ్యాకే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తామన్నారు. హైదరాబాద్ నుంచి ముంబై వయా నిజామాబాద్ రైల్వే లైన్ తో విషయమై సీఎం చర్చించామని తెలిపారు.జిల్లా అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఇదివరకే జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కళాశాల అగ్రికల్చర్ యూనివర్సిటీ మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. అలాగే జిల్లాకు పామాయిల్ ఇంటర్సిటీ కోసం కార్యచరణ చేస్తున్నామని అందుకు సీఎంతో మాట్లాడినట్లు పేర్కొన్నారు.

కొండగట్టు నిజామాబాద్ బాసర వరకు రోడ్లు వేస్తామని ఆయన తెలిపారు.ఈ దఫా బోనస్ కూడా ఇస్తామని,రైతులకు అండగా ఉంటామన్నారు.

కామారెడ్డిలో బీసీ సభ తప్పకుండా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మనల మోహన్ రెడ్డి గడుగు గంగాధర్, అరికెర నర్సారెడ్డి, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!