మున్సిపల్ ఎన్నికల కేంద్రాల పరిశీలన..మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, తెలిపారు.
బుధవారం నిజామాబాద్ డివిజన్ పరిధిలోని టౌన్-4 పోలీస్ స్టేషన్ పరిధిలో గల టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రమును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పర్యవేక్షించిన సీపీ, అక్కడ ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నామినేషన్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ (నిషేధాజ్ఞలు) అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ముఖ్యంగా నామినేషన్ల దాఖలు సమయంలో గుంపులుగా రాకుండా నియంత్రించాలని, శాంతిభద్రతల విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఈ తనిఖీల్లో సీపీ వెంట నిజామాబాద్ ఏసీపీ బి. ప్రకాశ్, టౌన్-4 ఎస్‌హెచ్‌ఓ సతీష్ కుమార్, రిటర్నింగ్ అధికారి వెంకటేష్, ఏఆర్వో రమేష్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు.
