ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో కిసాన్ మోర్చ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ కులాచారి గారు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ కులాచారి గారు మాట్లాడుతూ నిజామాబాద్ పసుపు రైతులకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ ధర్మపురి గారు ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం మేరకు పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది.
పసుపు బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా పసుపు బోర్డుకు జాతీయ చైర్మన్ ని కూడా మన నిజామాబాద్ జిల్లా రైతు కుటుంబానికి చెందిన శ్రీ పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్ గా నియమించడం జరిగింది.
అంతేకాకుండా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కూడా మన నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కేంద్ర కార్యాలయాన్ని ఈనెల చివరిన కేంద్ర హోంశాఖ మాత్యులు శ్రీ అమిత్ షా గారు ప్రారంభించడం జరుగుతుంది.
కావున నిజామాబాద్ జిల్లా రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పసుపు బోర్డు కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొని మన నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు ఏర్పాటుచేసి, కేంద్ర కార్యాలయాన్ని కూడా నిజామాబాద్ జిల్లాలో కేటాయించేందుకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి అమిత్ షా గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపేందుకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. -భారతీయ జనతా పార్టీ,నిజామాబాద్ జిల్లా
