HomeLaw and Orderగవర్నర్ వచ్చే వేళా స్తంభించిన ట్రాఫిక్ ......ఉరుకులు పరుగులు పెట్టిన పోలీసులు .......క్లియర్ చేసిన ఏసీపీ

గవర్నర్ వచ్చే వేళా స్తంభించిన ట్రాఫిక్ ……ఉరుకులు పరుగులు పెట్టిన పోలీసులు …….క్లియర్ చేసిన ఏసీపీ

గవర్నర్ రావడానికి కొన్ని నిమిషాల ముందే కొద్దీ సేపు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు చివరికి విషయం తెలిసి ఏసీపీ స్వయంగా రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేసారు.

గవర్నర్ స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేసుకొని అధికారులతో కాసేపు మాట్లాడారు మరికొద్ది సేపట్లో ఆయన గెస్ట్ హౌస్ నుంచి భూమా రెడ్డి ఫంక్షన్ హల్ కు బయలు దేరాల్సింది ఆయన ఎస్కార్ట్ భద్రత సిబ్బంది సైతం స్థానిక పోలీసులకు అలర్ట్ ఇచ్చారు ఈ మేరకు స్థానిక ఏసీపీ ప్రకాష్ తో పాటు అడ్వాన్స్ ఎస్కార్ట్ లో వుండే అధికారులు రూట్ క్లియర్ కోసం ముందే బయలు దేరారు కానీ సరిగ్గా కమిషనర్ ఆఫీస్ పక్కనే ఉన్న నిశితా డిగ్రీ కాలేజీ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది.

వాహనాలు రైల్వే బిడ్జ్ దాక నిలిచి పోయాయి అప్పుడే వచ్చిన ఏసీపీ వాహనం దిగి పరుగులు తీశారు.కాలేజీ బస్సులు రెండు రోడ్డు మీద నిలిపివేశారు.కాలేజీ విద్యార్థులు సైతం ఒక్కసారి బయటికి వచ్చారు. వారంతా గవర్నర్ మీటింగ్ కు వెళ్ళడానికే ఆ బస్సుల్లో ఎక్కుతున్నారు.

అయితే భారీగా ట్రాఫిక్ జామ్ కావడం తో బస్సులను అక్కడి నుంచి ముందుకు పంపి విద్యార్థులు రోడ్డు మీదికి రాకుండా కట్టడి చెయ్యడంతో వాహనాలు ముందుకు కదిలి ట్రాఫిక్ క్లియర్ అయింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments