HomeCRIMEఉమ్మెడ శివారులో విషాదం .. బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి ప్రాణాలు తీసుకున్న లింగారెడ్డి

ఉమ్మెడ శివారులో విషాదం .. బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి ప్రాణాలు తీసుకున్న లింగారెడ్డి

నందిపేట్ మండలం ఉమ్మెడ శివారులోని ఉమామహేశ్వర దేవస్థానం సమీపంలో శుక్రవారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది.

ఓ వ్యక్తి అక్కడి బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం నదిలో శవం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

గజ ఈతగాళ్ల సాయంతో శవాన్ని ఒడ్డుకు తీసుకొచ్చిన పోలీసులు, మృతుడిని బాద్గుణ గ్రామానికి చెందిన అల్లూరి లింగారెడ్డి (వయస్సు 55)గా గుర్తించారు.

ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments