HomeLaw and Orderతెలంగాణలో ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

తెలంగాణలో ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ విడుదల చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ను ఈఎస్‌ అండ్‌ టీ విభాగానికి బదిలీ చేయడంతోపాటు, ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. వికాస్‌ రాజ్‌ను రవాణా, రహదారులు, భవనాల శాఖ నుంచి ఇంధన శాఖకు బదిలీ చేశారు.

నవీన్‌ మిట్టల్‌కు పీఆర్‌, ఆర్‌డీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆర్‌ఎస్‌ఏడీ శాఖల బాధ్యతలు అప్పగించారు. షైలజా రామయ్యర్‌ను రెవెన్యూ (ఎండోమెంట్స్‌) శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.

రాహుల్‌ బొజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇలంబర్తి కే.ను రవాణా, రహదారులు, భవనాల శాఖ కార్యదర్శిగా నియమించడంతోపాటు రవాణా కమిషనర్‌ బాధ్యతలు అప్పగించారు.హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు హెచ్‌ఎండీఏ పరిధిలోని పట్టణాభివృద్ధి శాఖ, గ్రేటర్‌ హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్లకు సంబంధించిన అదనపు బాధ్యతలు అప్పగించారు.శృతి ఓజాను మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు.

ముషారఫ్‌ అలీ ఫారూఖీని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేయడంతోపాటు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. సౌరశక్తి పంపిణీ సంస్థ (టీజీఎస్‌పీడీసీఎల్‌) సీఎండీ జితేష్‌ వి.పాటిల్‌కు టీజీఆర్‌ఈడీసీఓ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.అలాగే, ఏ.వాణీ ప్రసాద్‌కు క్రీడలు, యువజన సేవలు, సాంస్కృతిక శాఖ బాధ్యతలు అప్పగించగా, డాక్టర్‌ ఎస్‌.సంగీత సత్యనారాయణను మహిళా, శిశు సంక్షేమ శాఖకు బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments