HomePOLITICAL NEWSUncategorizedమహిళల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి..బ్యాట్‌తో దాడి చేయడంతోనే మృతి చెందినట్లు సమాచారం

మహిళల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి..బ్యాట్‌తో దాడి చేయడంతోనే మృతి చెందినట్లు సమాచారం

ఇద్దరు మహిళల మధ్య జరిగిన ఘర్షణలో ఓ మహిళ మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్‌ తండాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పూర్ణ, మాదరి మధ్య గొడవ జరగగా, పూర్ణ బ్యాట్‌తో దాడి చేసినట్లు తెలిసింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మాదరిని గాంధారిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మాదరి మృతితో ఆగ్రహించిన ఆమె బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని, దాడికి పాల్పడిన వారిని తమకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై నిరసనకు దిగారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బంధువులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments