HomePOLITICAL NEWSUncategorizedరైస్‌ మిల్లర్లలో సీఐడీ గుబులు! బియ్యం ‘మిల్లింగ్’ అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం! నెట్‌వర్క్ గుట్టు విప్పుతున్న...

రైస్‌ మిల్లర్లలో సీఐడీ గుబులు! బియ్యం ‘మిల్లింగ్’ అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం! నెట్‌వర్క్ గుట్టు విప్పుతున్న విచారణ

పాత్రధారుల నుంచి సూత్రధారుల వైపు దర్యాప్తుసీఐడీ అధికారుల అరెస్టులు రైస్ మిల్లర్లలో గుబులు రేపుతోంది. గత సీజన్లలో రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించే సీఎంఆర్ బియ్యం బకాయిల విషయంలో ఇప్పటికే జిల్లాలోని పలు రైస్ మిల్లర్లపై పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా సీఐడీ అధికారులే రైస్ మిల్లర్లను అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. సీఎంఆర్ ధాన్యం ఎఫ్సఐకి ఇచ్చే విషయంలో జిల్లాలో ఆరు రైస్ మిల్లులు సన్నబియ్యం స్థానంలో దొడ్డు బియ్యం ఇచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారనే ఆరోపణలపై ఆదివారం తెల్లవారుజా మున జిల్లాకేంద్రంలోని పలువురు రైస్ మిల్లర్ నివాసాలపై సీఐడి అధికారులు ఏకకాలంలో దాడులు చేసి అదుపులోకి తీసుకున్నారు.

ప్రభుత్వానికి సన్న బియ్యం సరఫరా చేయాల్సిన చోట దొడ్డు బియ్యం పంపుతూ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు రైస్‌ మిల్లర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇన్నాళ్లూ విజిలెన్స్‌, పౌరసరఫరాల శాఖల తనిఖీలకే పరిమితమైన ఈ వ్యవహారంలోకి ఈసారి సీఐడీ నేరుగా రంగంలోకి దిగింది.

విజిలెన్స్‌ అధికారులు అందించిన పక్కా సమాచారం ఆధారంగా ఆదివారం తెల్లవారుజామున మిల్లులపై దాడులు నిర్వహించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. సన్న బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా, వాటి స్థానంలో దొడ్డు బియ్యం పంపినట్లు వచ్చిన ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది.

డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లాలో ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. లాబిశెట్టి శ్రీకాంత్‌, లాబిశెట్టి గంగ ప్రసాద్‌, పాకాల అంజయ్య, బొందుగుల దేవేందర్‌ను అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. మిల్లుల్లో అక్రమాలపై సాధారణంగా తనిఖీలు నిర్వహించే విజిలెన్స్‌, పౌరసరఫరాల శాఖలు ఈసారి అందించిన సమాచారంతో సీఐడీ దర్యాప్తు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ వ్యవహారంలో మిల్లర్ల పాత్ర తోపాటు అధికారుల ప్రమేయం, కుట్ర కోణంపై సీఐడీ అధికా రులు విచారిస్తున్నారు. రూ. కోట్లలో ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వానికి చేరాల్సిన బియ్యంలోనే నాణ్యత, రకం మార్పులు జరిగాయా? ఈ వ్యవహారంలో మిల్లర్లకే పరిమితమా.. సంబంధిత అధికారుల పాత్ర కూడా ఉందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. సీఐడీ దర్యాప్తు మరింత లోతుగా సాగితే ఈ అక్రమాల వెనుక ఉన్న ఇతరుల పాత్ర కూడా బయటపడే అవకాశముంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments