భార్య మరణాన్ని జీర్ణించుకోలేక భర్త ఆత్మ హత్యా…భార్య మృతిని జీర్ణించుకోలేక తీవ్ర మనస్తాపం చెందిన ఓ భర్త బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.
ఎస్ఐ ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ నగరంలోని పవన్ నగర్ కు చెందిన ఎర్రోళ్ల శ్యామ్(42). మృతుని భార్య గత 15 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిందని తెలిపారు.
వీరికి సంతానం కలగలేదు. దాంతో వారు ఇరువురు కలసి జీవనం కొనసాగిస్తున్నారు.జీవితాంతం తోడుగా ఉంటానన్న భార్య అర్ధాంతరంగా విడిచివెళ్లిందని తట్టుకోలేకపోయియాడు.
నీవు లేని జీవితం నాకొద్దంటూ బుదవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్ వెల్లడించారు.