డీసీసీ అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ లమధ్య వాగ్వివాదం అర్బన్ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ కొత్త క్యాంప్ కార్యాలయ వేదిక సాక్షిగా ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధమే సాగింది.
మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ బుధవారం అర్బన్ పర్యటించారు.
ఆయన అధికారులతో కలెక్టరేట్ కాంప్లెక్స్ లో రివ్యూ చేయడం ఫై అర్బన్ ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు. ఆతర్వాత మాజీ ఎంపీ మధుయాష్కీ ఇంట్లో షబ్బీర్ అలీ తన అర్బన్ క్యాంపు కార్యాలయం ను బుధవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభించారు.
కానీ ఇదే వేదిక వద్ద మాజీ కార్పొరేటర్ ముజాహిద్ హడావుడి చేయడం ఫై డీసీసీ అధ్యక్షుడు ఆక్షేపించారు. దీనితో ఇద్దరు మధ్య మాటల యుద్ధం సాగింది.నగర కాంగ్రెస్ నేతలు చాలసేపు చోద్యం చూసారు. చివరికి షబ్బీర్ ఇరువురిని సముదాయించారు.