కామారెడ్డి ప్రజలు ఛీకొట్టి తరిమేస్తే నిజామాబాద్ వచ్చిఅధికార ఆహం తో విర్రవీగుతున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ కి అర్బన్ ప్రజలు కర్రుకాల్చి వాత పెడతారని అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు.
ఆయన బుధవారం ఏ హోదా లో కలెక్టర్ ఆఫీస్ లో ప్రభుత్వ అధికారులతో రివ్యూ పెట్టడం తగదన్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు .
బుధవారం నిజామాబాద్ నగరంలోని బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఏ హోదా ప్రభుత్వాధికారులతోటి సమావేశం నిర్వహించారని ఆయన ప్రశ్నించారు. .
కామారెడ్డి లో చెల్లెనీ రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతుందనుకున్నావు. అందుకు మా ఇందూరు ప్రజలు నీకు కర్రు కాల్చి వాత పెడితే సరిపోయినట్లుంది. అర్బన్ మీద ప్రేమ ఉంటే ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి.
పదేళ్లలో ఒకరికి రేషన్ కార్డులు లేవు పెన్షన్ సరిగా వస్తలేవు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అద్వానంగా ఉందనీ తెలిపారు.దానిపైన శ్రద్ధ పెట్టాలన్నారు ప్రభుత్యం తో చర్చలు జరిపి కావలసిన నిధులను మంజూరు చేయాలని ఆయన సూచించారు.
ప్రభుత్యం వచ్చాక ప్రజా పాలన నీ కొత్తగా లక్షలాది అప్లికేషన్ తీసుకొని ఇప్పటిదాకా ఒక్క పనైనా చేశారా అని ఆయన ప్రశ్నించారు. అర్బన్ ప్రజలు షబ్బీర్ కు తగిన గుణపాఠం చెప్పినా సరే దొడ్డి దారిలో అధికారం చెలాయిస్తే ఊరుకునేది లేదన్నారు.
అధికారులు సైతం ప్రొటొకాల్ పాటించాలన్నారు.ప్రశాంతమైన హిందూ నగరాన్ని మతాల మధ్య చిచ్చు పెట్టడు ప్రారంభమైందనీ అన్నారు.
నీకు అంత ప్రేమ ఉంటే గత వారం సచివాలయానికి వెళ్లి అనేకమంది మంత్రులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఇన్చార్జి మంత్రి జూపల్లి ని కూడా అన్ని సమస్యలు ఇక్కడ ప్రభుత్వాస్పిటల్ పనితీరుపై , డబుల్ బెడ్ రూములు వృధాగా ఉన్నాయని, మున్సిపల్ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థపై ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదు అని ఆయన పేర్కొన్నారు.
కలెక్టర్ మర్చిపోయిన ఏ హోదాలో సమీక్ష నిర్వహించారు. అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాగోల్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, ఇతర పట్టణ కార్పోరేటర్లు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.