వివాదాస్పదంగా మారిన నీట్ యూజీ 2024 పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్‌తో విద్యార్థి సంఘాలు బుధవారం నిజామాబాద్ విద్యార్థి సంఘాలు రోడ్డు షొ నిర్వహించారు.
నగరం లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్‌యూఐ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ ర్యాలీలో పెద్దా పెద్ద నినాదాలు చేసుకుంటూ,పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దేశ వ్యాప్తంగా మే 5 నజరిగిన నీట్ పరీక్ష జరిగింది. పరీక్ష జరిగిన రోజే ప్రశ్న పత్రం లీక్ అయ్యింది అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయనీ అన్నారు.
పేపర్ లీకేజీతో సంబంధం ఉన్న దోషులను శిక్షించాలని, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా ఎన్టీఏను రద్దు చేయాలన్నారు. నీట్ పరీక్షను తాజాగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇకనైనా బీజేపీ నేతలు మేల్కొని విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ ర్యాలీ లో భారీ ఎత్తున విద్యార్థులు, పాల్గొన్నారు.



