HomeTelanganaNizamabadరైతులకు యూరియా సరఫరా నేరుగా చేయాలి......సిరికొండ ల్ రైతు ధర్నాలో - బీఆర్ఎస్ నేత...

రైతులకు యూరియా సరఫరా నేరుగా చేయాలి……సిరికొండ ల్ రైతు ధర్నాలో – బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి జగన్

యూరియా యాప్ తొలగించాలని డిమాండ్‌ చేస్తూ సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మంగళవార బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి మహాధర్నా నిర్వహించారు బిఆర్ యస్ పార్టీ నిజామాబాద్ రూరల్ ఇంచార్జ్ బాజిరెడ్డి జగన్ పాల్గొన్నారు .

ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ – రైతులపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే యూరియా యాప్ తెచ్చి రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సకాలంలో రైతుబంధు ఇవ్వక రైతులను ప్రభుత్వం నట్టేట ముంచుతుందని మండిపడ్డారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతును రాజును చేసే ఘనత కేసీఆర్ కే దక్కిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో రైతులకు ఎరువులు సకాలంలో పథకాలు అందించడంతోపాటు రైతు సంక్షేమం కోరిందని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్, ఆకుల తిరుమల్, లక్ష్మీ నరసయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments