రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా బాల్కొండ నియోజికవర్గ ఎమ్మెల్యే మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత గ్రామమైన వేల్పూర్ మండల కేంద్రంలోని కుటుంబ సమేతంగా వరుస క్రమంలో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ యొక్క అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని ఇది ప్రతి ఒక్కరి హక్కు అని, విలువైన ఓటును వృధా చేయకుండా ప్రతి ఒక్కరు ఓటు వేయాలని తెలిపారు
