HomeCRIMEవీడీసీ ఆగడాలను ఉక్కుపాదంతో అణిచివేస్తాం..పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి..

వీడీసీ ఆగడాలను ఉక్కుపాదంతో అణిచివేస్తాం..పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి..

గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. గత 15 సంవత్సరాలక్రితం కొన్ని గ్రామాలలో గ్రామాభివృద్ధి కోసం గ్రామభివృద్ధికమిటీలు ఏర్పాటుచేసుకోవడం జరిగింది.

గ్రామాలలో గ్రామాభివృద్ధి అవసరాలకు ప్రభుత్వం నుండి సహయ సహకారాలు పొందకుండా తమ అవసరాలను తీర్చుకోవడం కోసం గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు.

కాలక్రమేణ ఈ గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలను కాకుండా గ్రామాలలో జరిగే సివిల్ తగాదాలు, భూ తగాదాలు, వివాహ సంబంధ తగాదాలు అన్నదమ్ముల తగాదాలు, భార్యభర్తల తగాదాలలో వారిని పిలిపించి బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు.

ఆ పంచాయితీలలో ఇరువర్గాల వారు విననియేడల వారికి దండుగా వేసి, చట్టం చేయవలసిన పనిని వారి చేతులోనికి తీసుకొనీ బాధితులను పోలీస్ స్టేషన్ కు, న్యాయ స్థానాన్ని ఆశ్రయించకుండా గ్రామ ప్రజలను తాము చెప్పినవిధంగా వినాలని ఎవ్వరూకూడా పోలీస్ స్టేషన్, న్యాయస్థానాన్ని ఆశ్రయించరాదని లేనియెడల వారిని ఆ గ్రామం నుండి వెలివేస్తాము అని ,భయబ్రాంతులకు గురిచేస్తున్నారనీ తెలిపారు.

గ్రామంలో డబ్బులు వసూలు చేయడానికి గ్రామాభివృద్ది కమిటి పేరుతో బెల్టుషాపులు, కూల్ డ్రింక్ షాపులు, కిరాణ షాపు మరియు కోడిగ్రుడ్డు ధర పై యాక్షన్ (వేలం వేయడం) వేయడంలో ఎవరు ఎక్కువధర చెల్లిస్తారో ఆ వ్యక్తి మాత్రమే ఆ గ్రామంలో ఆ వస్తువులను అమ్మేటట్లు నియమముగా పెట్టి డబ్బులు వసూళ్ళు చేస్తున్నారని అలా వేలం వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గ్రామంలో ఎప్పుడైన పంచాయితీలు నిర్వహించినప్పుడు ఇరువర్గాల నుండి డబ్బులు వసూళ్లు చేసి పంచాయితీలను నిర్వహిస్తారనీ ,గ్రామాభివృద్ధి కమిటి నిర్వహించే కార్యకలాపాలు పూర్తిగా చట్టవ్యతిరేకమని అన్నారు.

ఎవ్వరికైన ఎలాంటి సమస్యలు వచ్చిన సంబంధిత శాఖలను సంప్రదించి ఆ శాఖ నుండి సహయసహకారాలు పొందాలనీ, గ్రామాభివృద్ధి కమిటి వారు వాళ్లు చెప్పిందే శాసనం అని, చట్టం అని చెప్పి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి తప్పుద్రోవ పట్టిస్తే దగ్గరలోని పోలీస్ స్టేషన్ అధికారిని సంప్రదించాలని తెలిపారు.

భవిష్యత్తులో ఎవ్వరయిని ఇలాంటి బహిష్కరణలు చేసినట్లయితే వారిపై చట్టరిత్య కఠిన మైన చర్యలు తీసుకుంటామని, ఎవ్వరిని కూడా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments