కుటుంబ తగాదాలను నేపథ్యంలో 11.4.2024న నవీపేట్ జన్నపల్లి గ్రామంలో నివసించే మాక్కల సాయిలు భోజనం చేసి ఇంట్లో నిద్రిస్తూ తెల్లవారి శవమై కనిపించాడు, విషయం తెలిసిన తల్లి మక్కల లక్ష్మి స్థానిక నవీపేట్ పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసింది.
భార్య రేఖకు మొక్కల సాయిలుకు పలుమార్లు గొడవలు జరిగిన విషయాన్ని పోలీస్ కంప్లైంట్ లో తెలపడంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరిపి, మృతుడి మెడపై ఉన్న కమిలిన గాయాన్ని గుర్తించి ఉరివేసి చంపినట్లుగా నిర్ధారణకు వచ్చారు.
భార్య మక్కల రేఖను ముద్దాయిగా చేరుస్తూ కోర్టులో ప్రవేశపెట్టారు ఈరోజు కేసును పూర్తిస్థాయిలో విచారించి థర్డ్ అడిషనల్ డిస్టిక్ట్ జడ్జి చిరంజీ ఆశాలత మక్కల రేఖను దోషిగా తెలుస్తూ జీవిత ఖైదు మరియు 2000 రూపాయలు జరిమానా విధించారు.
కేసు విచారణలో బాధితుల తరుపున pp రాజా రెడ్డి వాదనలు వినిపించారు మరియు లైసెన్ ఆఫీసర్ ఉన్నారు.
