HomeLaw and Orderనిజామాబాద్ జిల్లాకు కొత్త పాలనా అధికారి ఎవరో …..ప్రసూతి సెలవులో కలెక్టర్ ఇలా త్రిపాఠి..? పరిశీలన...

నిజామాబాద్ జిల్లాకు కొత్త పాలనా అధికారి ఎవరో …..ప్రసూతి సెలవులో కలెక్టర్ ఇలా త్రిపాఠి..? పరిశీలన లో నిర్మల్ లేదా కామారెడ్డి కలెక్టర్ల పేర్లు

బాధ్యతలు చేపట్టిన ఆనతి కాలంలోనే జిల్లా కలెక్టర్ గా పాలన వ్యవహారాల్లో గట్టి ముద్ర వేసుకున్న ఇలా త్రిపాఠి ప్రసూతి సెలవులో వెళ్లారు. ఆమె అయిదు రోజుల క్రితం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, చిన్నారి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిసింది.

డెలివరీకి రెండు రోజుల దాక ఆమె నిర్వీరంగా పనిచేసారు.ధాన్యం కొనుగోళ్లు…. సార్ పక్రియ లో ఆమె అత్యంత క్రియాశీలకంగా పనిచేసారు.అయితే ఇప్పడు ప్రసూతి సెలవులో వెళ్లడంతో ఆమె స్థానంలో ఇంచార్జ్ కలెక్టర్ గా ఎవరికి బాధ్యతలు ఇవ్వాలనే విషయంలో ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది.

కనీసం 40 రోజుల వరకు ఆమె బాధ్యతలోకి వచ్చే చాన్స్ లేక పోవడంతో ఇంచార్జ్ కలెక్టర్ నియామకం అనివార్యం అయింది నిజానికి ఇప్పటికే ఈ పక్రియ పూర్తీ కావలి. తాత్కాలికంగా అదనపు జేసీ భుజంగ్ రావు బాధ్యత ల్లో ఉన్నారు పాలనా వ్యవహారాల్లో ఆయనే అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

కానీ పూర్తీ స్థాయి లో ఇంచార్జ్ కలెక్టర్ నియామకం కోసం కసరత్తులు మాత్రం సాగుతున్నాయి నిజానికి ఆమె డెలివరీకి వెళ్లిన మరుసటి రోజే ఇంచార్జ్ కలెక్టర్ నియామకం జరగాలి.

ఇంచార్జ్ కలెక్టర్ గా నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రా లేదంటే కామారెడ్డి కలెక్టర్ లో ఒకరు నియామకం అవుతారని భావించారు నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రా ఎలాగో ఇలా త్రిపాఠి భర్త కావడంతో ఆయనకే బాధ్యతలు ఇస్తారని అధికారుల్లో ప్రచారం జరుగుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments