ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది మరో వైపు అధికార పార్టీలో అదే ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలయ్యింది.పట్టబద్రులనియోజకవర్గం ఎన్నికల ఫలితాలు వెలువడే నాడే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది.
పట్టబద్రుల నియోజకవర్గఎన్నికలో అభ్యర్థిగా కరీంనగర్ జిల్లాకు ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఈసారి ఉమ్మడి జిల్లాకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తుందనే చర్చ అధికార పార్టీ నేతల్లో ఉంది. మార్చి నెలఖారు లో అయిదు స్థానాలు ఖాళీ అవుతున్నాయి.
అయిదు స్థానాల్లో కనీసం నాలుగు స్థానాలు అధికార పార్టీ ఖాతాలో లోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంలో అధిష్టానం ఈపాటికే ఓ కసరత్తు కూడా చేసిందని పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ సర్దు చేయలేక పోయిన కీలక నేతల పేర్లు తెరమీదికి వచ్చే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ మహేష్ సొంత జిల్లా కావడంతో ఈసారి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు లో ఆయన ముద్ర కూడా ఉండ బోతుంది.
కానీ ఆయన జిల్లా నుంచి ఎవ్వరిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా సిఫారస్ చేసే పరిస్థితి లేదు. కానీ మాజీ మంత్రుల షబ్బీర్ అలీ ,మండవ ,అరికెల లాంటి నేతలపేర్లు మాత్రం ఎమ్మెల్సీ అభ్యర్థుల పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న షబ్బీర్ అలీ ఎమ్మెల్సీ పదవీ కోసం ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు.
ఎమ్మెల్సీ అయితే గాని మంత్రి అయ్యే అవకాశం లేదనే ఆలోచనతో ఆయన ఈసారి ఢిల్లీ స్థాయిలో గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారు. రేవంత్ క్యాబినెట్ ఇప్పటిదాకా మైనారిటీ లకు ప్రాతినిధ్యమే లేదు ఈసారి విస్తరణ లో మైనారిటీ లకు అవకాశం ఇవ్వడం అనివార్యంగా మారింది.
కానీ కాంగ్రెస్ నుంచి ఒక్కరూ కూడా ఎమ్మెల్యే లు లేరు అందుకే మండలి సభ్యుల్లో ఒకరిని క్యాబినెట్ లో తీసుకునే ఛాన్స్ ఉంది. షబ్బీర్ ఒక్కరే మైనారిటీ ల్లో బలమైన నేతగా ముద్రఉంది.యంఐయం నుంచి కూడాఢిల్లీ ఫై ఒత్తిడి పెంచే వ్యూహం లో షబ్బీర్ వర్గీయులున్నారు.
కానీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిన నేతలకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడానికి అధిష్టానం సానుకూలంగా లేదు ఆలా చేసే అరడజన్ మంది దిగ్గజ నేతలు క్యూ కట్టే అవకాశం ఉంది.
అందులోనూ షబ్బీర్ అలీ కి ఎమ్మెల్సీ అవకాశం ఈపాటికే ఓ సారి ఇచ్చిన అధిష్ఠానం మరోసారి అదే నేత కు ఎమ్మెల్సీ ఇవ్వడం అంత సుళువేమీ కాదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి కానీ రేవంత్ కొటారి లో షబ్బీర్ విషయంలో అధిష్టానం ఇవేవి చూడబోదని చెప్తున్నారు మరో వైపు రేవంత్ సన్నిహితులుగానే బిఆర్ యస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన మరో మాజీ మంత్రి మండవ కు సైతం కీలక పదవీ ఇవ్వాలనే ఆలోచనలో రేవంత్ ఉన్నా సరే ఎమ్మెల్సీ పదవుల్లో సామజిక సమీకరణలు ఏ మాత్రం అనుకూలంగా ఉన్న మండవ చాన్స్ వస్తుంది. అరికెల కు కూడా సామజిక సమీకరణ అడ్డంకి గా మారింది.
