నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా ఆత్మహత్యాయత్ననికి పాల్పడింది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే.. సాలంపాడు గ్రామం మండలం సాలూర కు చెందిన జయమ్మ భూమి సమస్య గురించి ప్రజావాణి కి చాలాసార్లు వచ్చినానని ఎవరు పట్టించుకోవడం లేదని దీంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఆమె వెంట పత్తి పంటకు సంబంధించిన పురుగుల మందు తీసుకొని రాగా బీడీ టీం వారు చెక్ చేసి ప్రజావాణిలో ఉన్న ఎసిపి నిజామాబాద్ వద్దకు తీసుకుని వెళ్ళినారు.
జయమ్మ కు సంబంధించిన 2 ఎకరాల భూమిలో ఒకటిన్నర ఎకరం భూమిని అమ్మగా మిగిలిన అరెకరం భూమిని.బడిగీ శ్రీనివాసరెడ్డి అతను మిగిలిన అరేకరం భూమిని ఆక్రమించి. ఆరెకరం పొలంలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నాడనీ చెప్పారు.
కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నా అయినా కూడా తనపై చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడనీ తెలిపింది. పొలానికి సంబంధించిన పూర్తి పత్రాలు తన వద్దని ఉన్నాయని తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా పరిష్కారం కావడం లేదని చెప్పారు.
దీంతో మనస్థాపంతో ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు ఆమె చెప్పింది.గమనించిన సెక్యురిటీ సిబ్బంది ఆమె గడ్డి మందు తాగకుండా అడ్డుకున్నారు. రూరల్ ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు.
