బైక్‌పై భర్తతో కలిసి స్వగ్రామానికి వెళ్తున్న మహిళను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి శివారులో శనివారం చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. బడాభీంగల్ మండలానికి చెందిన లింబాద్రి, సుజాత దంపతులు కామారెడ్డి నుంచి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు.
చంద్రాయన్‌పల్లి శివారుకు చేరుకోగానే వారి బైక్‌ను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో సుజాత రోడ్డుపై పడిపోవడంతో లారీ చక్రాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతిచెందింది.
ఆమె భర్త లింబాద్రికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
