HomeCRIMEఆయుధాలు, పోలీసు వాహనాలకు పూజలు..సిబ్బంది ఒత్తిడిలేకుండా విధులు నిర్వర్తించాలి: సీపీ సజ్జనర్‌

ఆయుధాలు, పోలీసు వాహనాలకు పూజలు..సిబ్బంది ఒత్తిడిలేకుండా విధులు నిర్వర్తించాలి: సీపీ సజ్జనర్‌

దుర్గాష్టమి సందర్భంగా హైదరాబాద్‌ పేట్ల బురుజులోని సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆదివారం ఆయుధ, వాహన పూజలు నిర్వహించారు. నగర పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనర్‌ ఐపీఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్మరీలోని ఆయుధాలతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో వినియోగించే పోలీసు పెట్రోలింగ్‌ వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రజా సేవలో నిరంతరం నిమగ్నమయ్యే పోలీసు అధికారులు, సిబ్బంది ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని దుర్గామాతను ప్రార్థించినట్లు తెలిపారు. విధి నిర్వహణలో మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.

హైదరాబాద్‌ నగర పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు దుర్గాష్టమి, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో డీసీపీలు ఆర్‌.వెంకటేశ్వర్లు, ఎస్‌.శ్రీనివాస్‌, చైతన్యకుమార్‌, రమణారెడ్డి, రాఘవేందర్‌రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments