ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాశాల నిజామాబాదు ఆధ్వర్యంలో . ఈ రోజు ZPHS స్కూల్ బోర్గం లో విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత ఆయుర్వేద మరియు యోగ అవగాహనా శిబిరం నిర్వహించినట్లు జిల్లా ఆయుష్ ఇంచార్జి డాక్టర్ జె. గంగా దాస్ తెలిపారు.
ఈ శిబిరం లో వర్షాకాలం లో వ్యాధులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, దిన చర్య, రుతు చర్య, సీజనల్ వ్యాధులు మరియు యోగ ప్రాముఖ్యత గురుంచి వివరించినట్లు తెలిపారు.ఈ శిబిరం లో యోగ విన్యాసాలు ప్రదర్శించి, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, ధ్యానం ల యొక్క ప్రాధాన్యత లను వివరించారు.
ఈ శిబిరం లో హెడ్ మాస్టర్ శంకర్, యోగ వైద్యుడు డాక్టర్ తిరుపతి, ఆయుష్ ఫార్మా సిస్ట్ పురుషోత్తం, యోగ శిక్ష కులు నమ్రత, రాజేందర్, ఆయుష్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు
