హమ్మయ్య రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ ఇచ్చేసింది. మండుటెండలతో అల్లాడిపోయిన వారికీ ఉపశమనాన్నిచ్చే రుతుపవనాలు వచ్చేశాయి. గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో రుతుపవనాలు కేరళం రాష్ట్ర తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
రాబోయే రోజుల్లో ఇవి దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయి. అలాగే జూన్ రెండోవారంలో తెలంగాణ కు విస్తరిస్తామని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం రుతుపవనాలు రాకతో కేరళంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కేరళం లో మూడు జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
అలప్పుజ, ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాల్లో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తమిళనాడులో ఏకంగా 15 జిల్లాలకు భారీ వర్షసూచన చేసింది. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది రుతుపవనాల రాక కాస్త ఆలస్యమవ్వగా.. ఎల్ నినో ఎఫెక్ట్ తో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతుందని ఇప్పటికే వాతావరణశాఖ ప్రకటించింది.కానీ నైరుతి రుతు పవనాలు సకాలంలో నే రావడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు
