నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ పదవి ఫై ఉత్కంఠ కు తెరపడింది. ప్రస్తుతం ఛైర్మెన్ గా ఉన్న కుంట రమేష్ రెడ్డి కి లైన్ క్లియర్ అయింది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఎట్టకేలకు రాజీ కుదిరింది. అయితే డిసి యం ఎస్ ఛైర్మెన్ స్థానం బీసీ లకు ఇవ్వడానికి ఇద్దరు ఎమ్మెల్యే లు సైతం అంగీకరించారు.
దీనితో రెండు కీలక పదవుల విషయంలో అధికార పార్టీలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. డీసీసీబీ ఛైర్మెన్ స్థానం కోసం పీసీసీ చీఫ్ మహేష్ మొదట పూరన్ రెడ్డి పేరును ప్రతిపాదించారు కానీ ఇద్దరు ఎమ్మెల్యే మాత్రం సిట్టింగ్ ఛైర్మెన్ రమేష్ రెడ్డి కి మరోసారి అవకాశం ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టారు.
రమేష్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి కి దగ్గరి బంధువు కావడంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెనక్కి తగ్గడం అనివార్యం అయింది . ప్రస్తుతం ఛైర్మెన్ గా ఉన్న కుంట రమేష్ రెడ్డి మరో సారి డీసీసీబీ ఛైర్మెన్ గా నియామకం అవ్వడం ఖాయం అయింది.
అదీగాక పీసీసీ చీఫ్ మహేష్ రెడ్డి తెరమీదికి తెచ్చిన పూరన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తో ఏ మాత్రం సంబంధం లేక పోవడంతో పార్టీ నేతల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి పూరన్ రెడ్డి ఏకంగా డీసీసీబీరేసు లో కి రావడం సీనియర్ కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం మింగుడు పడడం లేదు.
అంతేగాక పూరన్ రెడ్డి కూడా సుదర్శన్ రెడ్డి కి సమీప బంధువు కావడంతో మహేష్ కుమార్ సైతం వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గారు దీనితో రమేష్ రెడ్డి కి డీసీసీబీ పీఠం దాదాపు ఖరారు అయింది.
కీలకమైన ఐడిసియంఎస్ ఛైర్మెన్ స్థానం ఖచ్చితంగా బీసీ లకు కేటాయించేలా మహేష్ ఇద్దరు ఎమ్మెల్యే లను ఒప్పించారు నిజామాబాద్ అర్బన్ నుంచి ఒక్కరిని ఐడిసియం చైర్మన్ గా నియామకం కానున్నారు.ఈ పదవి కి ఎవరికి కట్టబెట్టాలనే విషయంలో మాత్రం మహేష్ అర్బన్ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు
