బహుజన సమాజ్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ నీరడీ లక్ష్మణ్ తో పాటు, అర్బన్ ఇంచార్జ్ కె. రాజ్ కుమార్, మహిళా నాయకులు తార, శారద లు బీఎస్పీ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నీరడి లక్ష్మణ్ ప్రకటించారు.
బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బహుజన సమాజ్ పార్టీ ఆత్మ గౌరవాన్ని ఇచ్చే పార్టీ అని, ఈ పార్టీలో ఉంటూ జాతిని విడదీసిన మందకృష్ణ మాదిగ కాళ్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ తన పుట్టినరోజు సందర్భంగా మోక్కడం చారిత్రక తప్పిదం అని నీరడి లక్ష్మణ్ అన్నారు.
దీనిని నిరసిస్తూ బహుజన సమాజ్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అర్బన్ ఇంచార్జి కె. రాజ్ కుమార్, మహిళా నాయకురాలు పి. తార, శారద, లు కలిసి రాజీనామా చేసినట్లు వారు తెలిపారు. తమ రాజీనామా పత్రాలను బి ఎస్ పి పార్టీ కార్యాలయానికి కి పంపిస్తామని తెలిపారు.
